భూములు లాక్కుంటే ఊరుకోం..

 పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కు ంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ సర్వే చేసిన గ్రామాల్లో సోమవారం సిపిఎం బృందం పర్యటించింది. అధైర్య పడవలసిన అవసరంలేదని, రైతులకు సిపిఎం అండగా నిలుస్తు ందని భరోసా ఇచ్చారు. అనంతరం వైవి మాట్లాడు తూ, రాష్ట్రంలో జిల్లాకు లక్ష చొప్పున 13 లక్షల ఎకరాల భూమిని భూ బ్యాంకు పేరుతో ప్రభు త్వం లాక్కుంటోంద న్నారు. దొనకొండలో అధికా రులు చేసిన సర్వేపై సరైన పరిశీలన లేకుండానే 25 వేల ఎకరాలను తీసుకునేందుకు రంగం సిద్ధం చేయ డం సరికాదన్నారు. గత ప్రభుత్వం భూ పంపిణీలో ఇచ్చిన వాటిని పేదల నుంచి తిరిగి తీసుకునేం దుకు సన్నద్ధమవడం, నష్ట పరిహారం సంగతి తేల్చకుం డానే భూములు లాక్కో వడం దౌర్జన్యకరమన్నారు.