భాగస్వామ్య సదస్సు - 2016 పేర రాష్ట్ర సంపద లూఠీ - సిపియం పార్టీ

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం- భారత పారిశ్రామిక సమఖ్య (సిఐఐ)లు సంయుక్తంగా కలిసి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిపారు. ఈ సదస్సులో మొత్తం 328 ఒప్పందాలు జరిగాయని వీటివల్ల 4.67క్ష కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందని, 9.58 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

                ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రం దేశంలో కెల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలోకి వెళుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం హారెత్తిస్తున్నారు. వాస్తవంగా ఈ పెట్టుబడుల సదస్సు వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనంకన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని భావిస్తున్నాం.

                 * పెట్టుబడుల ఒప్పందాల పేర రాష్ట్రంలో రైతుల భూములు, ప్రభుత్వ భూములు  పెద్దఎత్తున పెట్టుబడి దారులకు కట్టుబెడతారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 10 లక్ష ఎకరాల భూములు సేకరించాని నిర్ణయించింది. వెంటనే 5లక్ష ఎకరాలు సిద్ధం చేయాలని సదస్సులో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

                 * విశాఖ జిల్లాలోని ప్రభుత్వ భూములు, రైతుల భూములు, కొండలు, సహజ వనరులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, బి.హెచ్‌.పి.వి, రైల్వే, పోర్టు, జివిఎంసి, ఆంధ్రాయూనివర్సిటీ తదితర సంస్థల భూములు పారిశ్రామిక వేత్తకు ధారాదత్తం చేయబడతాయి.

                * రాష్ట్ర తీర ప్రాంతం మొత్తం కొద్ది మంది బడా సంస్థల ఆధిపత్యానికి కట్టబెట్టబడుతుంది. లక్షలాది మత్య్సకారులను, ప్రజలను బలవంతంగా నిర్వాసితులను చేయబోతున్నారు.

                * రాష్ట్రంలో గనులు, నీరు, భూమి అటవీ సంపద వంటివి వనరులు కొల్లగొట్టబడతాయి.

                * రాష్ట్రంలోని పట్టణ, నగర ప్రాంతాల్లోని స్థానిక మున్సిపల్‌ సంస్థ కార్యకలాపాల  ప్రైవేట్‌పరమవుతాయి. పౌర సేవలు మరింత ప్రైవేటీకరణకు దారితీస్తాయి. వీటి ఆధీనంలోని భూములు, స్థలాల విభాగాలు ప్రైవేట్‌ సంస్థ సొంత ఆస్తులుగా మార్చబోతున్నారు.

                * రిటైల్‌ రంగంలోకి భారీ ప్రైవేట్‌ పెట్టుబడులకు అనుమతించడం వల్ల లక్షలాది చిరువ్యాపారులు దివాళా తీస్తారు. లక్షలాది మంది నిరుద్యోగులౌతారు. రిటైల్‌ వ్యాపారం కొన్ని సంస్థల చేతుల్లో కేంద్రీకృతమౌతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం.

                * పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాసేదిగా తన నిజస్వరూపాన్ని బహిర్గత పరుచుకున్నది.

                * రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు చాలా వరకు కార్యరూపం దాల్చవు. 2012లో కూడా పెట్టుబడుల భాగస్వామ్యం సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు. అప్పుడు కూడా 6 లక్ష కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిల్లో ఎన్ని ఆచరణలోకి వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలి.

                * సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రతి సం॥రం ఏదో ఒక రాష్ట్రంలో 1995 నుండి జరుగుచున్నది. సర్కస్‌ కంపెనీ వలే ఈ సంస్థలు అన్ని చోట్ల పాల్గొంటాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే విచ్చతవిడిగా దోపిడి చేసుకోవటానికి సకత సదుపాయాలు కల్పిస్తుందో అక్కడ పెట్టుబడులు పెట్టటానికి సిద్ధపడతాయి. ఇందులో చంద్రబాబు నాయుడు ప్రధమస్థానంలో నిలిచాడు.

                * ఈ ఒప్పందా ద్వారా పారిశ్రామిక చట్టాలు, కార్మికచట్టాలు, పర్యావరణ చట్టాలు అన్ని మార్చివేసి పెట్టుబడిదారుల అరాచకాలకు నియంత్రణ లేకుండా చేస్తారు. కార్మికులకు ఉపాధి, వేతన భద్రత ఇతర చట్టబద్ద హక్కు తొలగించడతాయి. నిర్వాశితులకు, స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తాయి.

                * రిలయన్స్‌ సంస్థ విశాఖపట్నం రాంబిల్లి వద్ద 5వేల కోట్ల పెట్టుబడిలతో షిప్‌యార్డులను నిర్మిస్తానని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలు అయిన గార్డెన్‌ రీచ్‌ షిప్‌యార్డు (జి.ఆర్‌.ఎస్‌) రాంబిల్లి ప్రాంతంలో షిప్‌యార్డు నిర్మిస్తుందని ప్రచారం చేసిన రాష్ట్రప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందో తెలపాలి. ఇందులో పెద్ద కుట్ర ఉందని భావిస్తున్నాం. రియన్స్‌ వల్ల విశాఖనగరంలో ఉన్న హిందూస్థాన్‌ షిప్‌యార్డుకు తీవ్ర ప్రమాదం వాట్లిలుతుంది. గత 8 ఏళ్ళ నుండి కేంద్ర ప్రభుత్వాలు దీనికి ఎటువంటి ఆర్డర్స్‌ ఇవ్వకుండా నష్టాల్లోకి నెడుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్‌ఎస్‌ఎల్‌కు ఆర్డర్స్‌ కొరకు నేటికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు.

                రాబోయే 15 ఏళ్ళలో భారత నౌకాదళంలో 90శాతం నౌకను ఆధునీకరించి రీఫిట్‌ చేయాల్సి ఉంది. దీనికి కనీసం ఏడాదికి 20 వేల కోట్ల రూపాయల చొప్పున సుమారు 15 ఏళ్ళలో 3లక్ష కోట్లు కేంద్ర రక్షణ శాఖ వెచ్చించనుంది. ఈ ఆర్డర్స్‌ ఎట్లాగైన దక్కించుకోవడానికి రిలయన్స్‌ సంస్థ విశాఖలో షిప్‌యార్డును నిర్మించడానికి పూనుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం విశాఖకు తీవ్ర నష్టం.

                 రిలయన్స్‌ సంస్థ గుజరాత్‌లోని పిపవాషిప్‌యార్డును ఇటీవల కొనుగోలు చేసింది. రక్షణ రంగ పరికరాల తయారీ కొరకు 13 రకాల లైసెక్స్‌ కొరకు అంబానీ కేంద్ర ప్రభుత్వానికి ధరఖాస్తు చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే రక్షణరంగ ఆర్డర్స్‌ అన్ని అంబానీ వశం చేసుకోవటానికి పెద్ద కుట్రగా ఉంది. ఇది బిజెపి, టిడిపి సహకారంతోనే జరుగుతున్నదనిపిస్తున్నది. 

                * ఇప్పటికే ప్రమాదకర పరిశ్రముగా పరిగణించబడిన వాటికి తిరిగి ఈ సదస్సులో వాటి కార్యకలాపాలు విస్తరించుకోవడానికి ఒప్పందాలు చేసుకోవడం అన్యాయం. ఉదా: శ్రీకాకుళంలో ఉన్న ట్రైమాక్స్‌ బీచ్‌ శాండ్‌ సంస్థ 2500 కోట్లుతో విస్తరణకు రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఇప్పటికే  అనేక ఆంధోళనలు జరుగుచున్నాయి. బీచ్‌శాండ్‌ తీయడం వల్ల సముద్రపు నీరు సుదూర ప్రాంతాలకి చొచ్చుకెళ్ళి గ్రామాల  భూగర్భ నీరు ఉప్పు నీరుగా మారుతున్నాయి. పర్యావరణం కలుషితం అవుతున్నది. తాజా ఒప్పందం అక్కడి ప్రజలకు, మత్య్సకారులకు తీవ్ర నష్టం.

                * ఖాయిలాపడిన పరిశ్రమల పునరుద్దరణ కొరకు చంద్రబాబు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో 28 ఫెర్రొఎల్లాయిస్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. 12జ్యూట్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. చక్కెర పరిశ్రమలు కునారిల్లుతున్నాయి. షిప్‌యార్డు, బిహెచ్‌పివిలకు ఆర్డర్స్‌ లేవు. స్టీల్‌ప్లాంట్‌కి సొంత గనులు కేటాయించకపోవడం వల్ల తీవ్ర ఒడిదడుకులు ఎదుర్కొంటున్నది.

                * విశాఖ నగరంలో ఉన్న ఐటి పరిశ్రమలు అగమ్యగోచరంలో ఉన్నాయి. ఐటి దిగ్గజాలైన విప్రో, సత్యం మహేంద్ర  వంటివి పూర్తయి 6 ఏళ్ళయిన ప్రారంభించలేదు. అనేక సంస్థలు రుషికొండ మీద నిర్మాణమైన ప్రారంభంకాలేదు. ప్రారంభమైనవి మూసివేస్తామని ప్రకటిస్తున్నారు.