బిసిల హామీలు నెరవేర్చాలి:ఉమా

 చేతివృత్తిదార్లకు ఉపాధి చూపడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయ వాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో మంగళవారం జరిగిన చేతివృత్తిదారుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేట్‌ రంగంలో బిసిలకు రిజర్వేషన్‌ కల్పించాలని డిమాం డ్‌ చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో బిసిలకిచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిం చారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించినప్పటికీ పూర్తిస్థాయిలో ఆచర ణకు నోచడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అన్నివర్గాల ప్రజలనూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. వృత్తిదారుల సమన్వయకమిటీ కన్వీనర్‌ పటాపంచుల జమలయ్య మాట్లాడుతూ చేతివృత్తిదార్ల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శంచారు. దేశంలో 145 బిసి కులాలున్నాయని, ఇంత పెద్దఎత్తున ఉన్న బిసిలకు సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.