బలవంతపు భూ సేకరణ ఆపాలి.

సబ్బవరం మండలం వంగలి సర్వేనెంబర్‌ 109, 135, 240, 241, 242లోగల అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్‌ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సేకరణకు సంబంధించి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన భూహక్కుదారుల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. హక్కుదారులలో కొంతమందికి ఐదు ఎకరాల సాగు భూమి ఉండగా 2, 3 ఎకరాలు ఉన్నట్లుగా చూపిస్తున్నారని తెలిపారు. మరికొంత మంది హక్కుదార్ల పేర్లు జాబితాలో లేవన్నారు. 30 ఏళ్లుగా సాగుచేస్తున్న రైతుల ఆమోదం లేకుండా భూ సేకరణ చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా గ్రామంలో భూమిని రీసర్వే చేసి నిజమైన సాగుహక్కు దారులను గుర్తించి ప్రకటించాలన్నారు. 
భూ సేకరణ జరిగిన చోట వ్యవసాయ కార్మికులకు ప్యాకేజీ ప్రకటించాల్సి ఉందన్నారు.