ప్రైవేటురిజర్వేషన్ల కోసంKVPS

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణల్లో సామాజిక న్యాయం లేకపోవడంతో ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు, ఉన్న ఉద్యోగాలకు భద్రత సన్నగిల్లుతున్నాయని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారావు పిలుపునిచ్చారు. శ్రీశ్రీ భవన్‌లో బుధవారం కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు. కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఈనెల 28న గుర్రం జాషువా జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అక్టోబర్‌ 2 కెవిపిఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విస్తృతంగా పర్యటించి సమస్యలపై అధ్యయం చేయాలని, కెవిపిఎస్‌ పతాకాలను ఆవిష్కరించాలని సూచించారు. దళిత సంఘాలు, ఉద్యోగులు, మేధావులు, అంతా ఐక్య కార్యాచరణగా ప్రైవేటు రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలన్నారు.