ప్రభుత్వానికి కళ్లు లేవు:మధు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు లేవని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వామపక్షాలు విజయవాడ లెనిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. ప్రభుత్వం పన్నుల విధానంలో మార్పు తీసుకురావడం వల్ల ధరలు పెరిగిపోయాయన్నారు. రైతు దగ్గర నుండి తీసుకున్న ధరకు నిమిత్తం లేకుండా అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తయారు చేసిన జీఎస్టీ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని, దీనిని తిప్పికొట్టాలన్నారు.