ప్రత్యేక హోదాపై ప్రధాని దిష్టిబొమ్మదగ్ధం..

రాజధాని శంకు స్థాపనకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడి ప్రత్యేక తరగతి హోధాపైగానీ,ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజిపైగాని, విభజన హామీలపైనా పల్లెత్తు మాట కూడ మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ సిపియం ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. దహానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు వీఫలయత్నం చేశినా నాయకులు పట్టు వదలకుండా దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలొ తెలిపిన నిరసనను పోలీసులు అడ్డుకున్నందుకు శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడూతూ ప్రధాని మోడి రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్థాడని ప్రజలు ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకహోదా పైనా, ఆర్ధికంగా, ఆభివృద్ధిలో వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర కు పత్యేక ప్యాకేజిపైనా ఒక స్పష్టమైనా హామీ ఇస్థారని ప్రజలు భావించారని, కానీ మోడీ ప్రసంగంలో ఎక్కడైనా వాటి ఊసెత్తలేదన్నారు. డిల్లీ నుండి తెచ్చిన మట్టి, నీరుతో సరిపెట్టారని, వాటితో ప్రజలకు వరిగెదేమి ఉండదని రామారావు ఎద్దేవా చేశారు. ప్రధాని వైఖరి రాష్ట్రాప్రజలను అవమానపరచటమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని లేని పక్షంలో బిజెపి,టిడిపిలను ప్రజలు క్షమించరన్నారు. ప్రత్యేక హోదా సాధనకై పేద్ద ఏత్తున ఆంధోళన చేస్థామని హెచ్చరించ్చారు.