ప్రజాస్వామ్య సంస్కృతి..

 మధ్యయుగాల నాటి సామాజిక జీవితపు పోకడలతో పోలిస్తే ఆధునిక ప్రజాస్వామ్యం ఒక సుగుణం. శతాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉదాత్తాంశం. సకల రంగాల్లో వ్యక్తి స్వేచ్ఛకూ, సమానత్వానికీ, ఎంచుకునే హక్కుకూ మూలం ప్రజాస్వా మ్యం. రాచరికపు సంస్కతికి భిన్నమైన ప్రజాస్వామ్యం ఓ అందమైన భావన. ఆచరణలో విరుద్ధాంశాలు కనిపించినప్పటికీ మౌలికంగా ప్రజాస్వామ్య సూత్రాలకు బద్ధులై ఉండాలన్న భావనలు 1950 కాలం నాటికి బలపడ్డాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఈ భావనలు మరింత శక్తిని పుంజుకుని ప్రజాస్వామ్య సంస్కతి పరిఢవిల్లాల్సింది. అందుకు భిన్నంగా కాలం చెల్లిన భూస్వామ్య నిరంకుశత్వపు పోకడలు సామాజిక జీవితంలో పెత్తనం చెలాయించడం వర్తమాన వాస్తవం. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం మతం వ్యక్తిగత అంశంగానే ఉండిపోవాలి. కానీ సామాజిక, రాజకీయ రంగాల్లో మతం ప్రాబల్యం పెరిగింది. మతోన్మాద శక్తులు మునుపెన్నడూ లేనంతగా ప్రజాజీవితంలోకి చొచ్చుకురావడం చూస్తున్నాం. ప్రజల దైనందిన జీవితపుటలవాట్లనూ శాసించడం మతం పేరుతో చెలరేగిన ఉన్మాదానికి పరాకాష్ట. ఎవరు ఏం తినాలో, ఏం వినాలో, ఏం చదవాలో, ఏం చూడాలో మతోన్మాద శక్తులు చెప్పబూనడం దుస్సాహసం. సజనశీలురు ఏం రాయాలో, ఏం రాయకూడదో మతం పేరిట చెలరేగిన శక్తులే నిర్ణయించే చోట వ్యక్తి స్వేచ్ఛ ఎండమావే. వ్యక్తీకరణకు సంకెళ్ళను విధించడమే. కళాకారుల అభివ్యక్తిని నియంత్రించడమే. ఇది అంతిమంగా ప్రజాస్వామ్య సంస్కతిని కాలరాయడమే. అమలులో ఉన్నది బూటకపు ప్రజాస్వామ్యం అని చెప్పకనే చెప్పడం.
చాలా సందరాÄ్భల్లో, సంఘటనల్లో ప్రజాస్వామ్య సూత్రాలు మాటలకే పరిమితమనే సంగతి చూస్తున్నాం. ఆచరణలో సంపూర్ణ ప్రజాస్వామ్యం అమలు కావడం ఇంకా కలగానే మిగిలింది. ఇప్పుడు ఆ కలను పూర్తిగా తుడిచిపెట్టే దుర్మార్గానికి సంఫ్‌ుపరివార్‌ శక్తులు పూనుకున్నాయి. సమాజాన్ని మధ్యయుగాల కాలానికి తీసుకెళ్ళేందుకు ఒడిగట్టాయి. కనీసం ప్రజల వాక్కును శిరోధార్యంగా భావించే ధోరణి కూడా అధికారంలో ఉన్నవారి వ్యవహార సరళిలో కనిపించడం లేదు. రాజ్యాధికారం ప్రజల కోసమే అనే భావన కూడా కానరాని పరిస్థి తుల్లో పాలకుల నిజాయితీ ప్రశ్నార్థకం. మాటకు కట్టుబడి ఉండడం, నిజాయితీగా వ్యవహరి ంచడం, ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించడం అధికారంలో ఉన్నవారి విధి అని థామస్‌ జఫర్సన్‌ ఏనాడో చెప్పారు. కానీ ఏడాదిన్నర కిందట చెప్పిన మాటలకీ, ఇవాళ వాస్తవంలో జరుగుతున్న దానికీ పొంతనే లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగమనానికీ, పాలకుల సంకుచిత విధానాలకీ నడుమ సామ్యం కనిపించదు. ప్రతి వ్యక్తి కన్నీటిని తుడవటమే ప్రభుత్వం చేయాల్సిన పని అని స్వామి వివేకానంద ప్రబోధించారు. ఆ మాటలు కూడా అధికారంలో ఉన్నవారికి పట్టలేదు. ఈ ధోరణిని ప్రశ్నించే శక్తుల మీద, వ్యక్తుల మీద రకరకాల రూపాల్లో దాడులు చేస్తున్నారు. విభేదించే హక్కును కూడా భరించలేని అసహనాన్ని ప్రదర్శించడం చూస్తే అబ్రహాం లింకన్‌ మాటలు గుర్తుకొస్తున్నాయి. ఒక వ్యక్తి గుణగణాలను పరిశీలించాలనుకుంటే అతనికి ఒకసారి అధికారం ఇస్తే చాలు అన్నారాయన. సరిగ్గా ఏడాదిన్నర కిందట చేసిన పని ఫలితం ఎంత వికతంగా పరిణమించిందో అనుభవంలోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో గళమెత్తాల్సిన మేధావులు, కవులు, రచయితలు స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్య సంస్కతి పతనావస్థ మీద నిరసన రావాలు వినిపిస్తున్నారు. రచయితల కలాలకూ, కళాకారుల గళాలకూ ఆంక్షలు పెట్టడంలోని అనౌచిత్యాన్నీ, దుర్మార్గాన్నీ ప్రశ్నిస్తున్నారు. ప్రజల స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కాపాడాల్సిన పాలకుల నిష్క్రియా త్మక ధోరణిని నిలదీస్తున్నారు. అణచివేతను ఏ సమాజమూ, ఏ వర్గమూ ఎల్లకాలం భరించ లేదు. ప్రతిఘటన అనివార్యమనేది చారిత్రక సత్యం. చరిత్రను కూడా వక్రీకరించేందుకు పాల్పడుతున్న ప్రభుత్వాలు ఈ సత్యాన్ని అంత త్వరగా గుర్తించవు. కానీ గుర్తించేలా చేయడం ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారి విధి. కేవలం సూత్రాలకే పరిమితం కాకుండా ఆచరణలో ప్రజాస్వామ్యం నిగ్గుదేలాలి. ఆచరణలో ప్రజాస్వామ్యం పదునెక్కాలి.
సుపరిపాలన అన్నది ప్రజాస్వామ్యంలో పాలకుల బాధ్యత. దానిని విస్మరించారు. జనహితమే పాలకుల పరమావధి. వీటికి భిన్నంగా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించే మతో న్మాద శక్తులు రాజ్యం చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు అశనిపాతం. ప్రజల అభీష్టా నికి వ్యతిరేకంగా ప్రతి అంశంలో ప్రజల అభిరుచులను, అలవాట్లను, భావాలను నియం త్రించాల నుకోవడం నియంతత్వం. ఇది ప్రజాస్వామ్య నియమాలకే విరుద్ధం. ప్రజాస్వామ్యపు అంత ర్గత నియమం స్వేచ్ఛ. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే పౌరులు స్వేచ్ఛను అనుభవిస్తారు. ఆ స్వేచ్ఛను కాపాడటమే ప్రజాస్వామ్య సంస్కతి మనుగడకు అవసరమని అరిస్టాటిల్‌ వంటి వారు చెప్పారు. కానీ ఆ స్వేచ్ఛ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్య మౌలిక సూత్రా లను కాపాడుకోవటం ద్వారానే ప్రజాస్వామ్య సంస్కతి మనుగడ సాగిస్తుంది. ప్రజల విశ్వాసా లకూ, నమ్మకాలకూ విఘాతం కల్పిస్తూ సామాజిక జీవితంలోని సకల అంశాలనూ నియంత్రి ంచే ధోరణిని ఎదుర్కోవాలన్న చైతన్యం ఇనుమడిస్తుంది. ఈ ఎరుక, చైతన్యం సామూహిక శక్తిగా, సంఘటిత శక్తిగా రూపొందడం ప్రజాస్వామ్య సంస్కతి మనుగడకు అవసరం.