పేదల ఇళ్లపట్టాల కోసం వామపక్షాల పాదయాత్ర

            అర్హులైన పేదలందరికీ జిఒ 298 ప్రకారం ఇళ్ళపట్టాలు ,స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యాన శనివారం శాంతానగర్‌, అంబేద్కర్‌నగర్‌, గాంధీనగర్‌, కార్మికనగర్‌, జ్యోతినగర్‌, వుడాకాలనీ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి గంగారావు మాట్లాడుతూ జిఒ 296 ప్రకారం వంద గజాల లోపు ఇళ్లను, స్థలాను ఉచితంగా క్రమబద్దీరకణ చేస్తామని ప్రకటించి, దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటిల్లో అనేకం గెడ్డలు, కొండలు, చెరువులని చెప్పి తొలగించాలరన్నారు. పేదలకు జి+1 ఇళ్లు ఇవ్వాలని, హుదూద్‌ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 
సిసిఐ జిల్లా కార్యదర్శి ఎజె స్టాలిన్‌ మాట్లాడుతూ జివిఎంసి పరిధిలో ఇళ్ల కోసం వచ్చిన వాటిలో దాదాపు 1.05 లక్షల దరఖాస్తులను రేషన్‌కార్డులు, ఆధార్‌ నెంబర్లు సరిగాలేవని తొలగించారని విమర్శించారు. దీన్ని వామపక్షపార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం వామపక్షాల ఆధ్వర్యాన ఉద్యమకార్యాచరణ రూపొందించామని, దానికి ప్రజలను సమాయత్తం చేసేందుకు పాదయాత్రలు, కరపత్రాల పంపిణీ చేస్తున్నామన్నారు. ఆందోళనల్లో భాగంగా ఈనెల 16న మండల కార్యాలయాల వద్ద ధర్నా, 18న జివిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద నిరసన, 22న చలో విజయవాడ కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం గోపాలపట్నం డివిజన్‌ కమిటీ సభ్యురాలు బి అనంతలక్ష్మి, బి రమణి, అప్పలరాజు, సిపిఐ నగర కార్యదర్శి మార్కేండయులు, సిపిఐ కార్యవర్గసభ్యులు ఎమ్‌పైడిరాజు, నగరసమితి సభ్యులు ఆర్‌ శ్రీనివాసరావు, వేపగుంట సిపిఐ నాయకులు రాంబాబు, సిపిఎం కార్యకర్తలు సూర్యప్రకాశ్‌, స్వామి, అప్పలనాయుడు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.