పేదలపై ప్రభుత్వం చిన్నచూపు

పేదలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. పట్టణంలోని ఆదర్శ పాఠశాల సమీపంలో ఇటీవల పేదలు స్వాధీనం చేసుకున్న ఉన్న 570 సర్వే నెంబర్‌ స్థలాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాజకీయ నాయకులు, ధనికులకు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెడుతోందన్నారు. కొండలకు కూడా పట్టాలు ఇచ్చి వారికి పంపిణీ చేస్తోందన్నారు. పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి మాత్రం వారు ముందుకు రాలేదన్నారు. రెండు విడతల జన్మభూమిలో జిల్లా వ్యాప్తంగా 57,376 మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చారన్నారు. ఇందులో కేవలం 16 వేల మందికి మాత్రమే పట్టాలు ఇస్తామంటూ ప్రభుత్వం చెబుతోందన్నారు. 22 మండలాల్లో 37 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలుందన్నారు. జన్మభూమి కమిటీల్లో టిడిపి నాయకులు ఉండడం వల్ల పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పథకాల వర్తింపులో వారి జోక్యం అధికం అయిందన్నారు. రాజకీయ పార్టీలు, కుల సంఘాలకు అతీతంగా పేదల కోసం సిపిఎం పోరాటాలు సాగిస్తుందన్నారు. ఇళ్ల స్థలాలు, పక్కా గృహాల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్‌ కార్యదర్శి శ్రీనివాసులు, మండల కార్యదర్శి శ్రీరాములు, నాయకులు ఓబిలేసు, మల్లికార్జున, రామచంద్రస్వామి, ఐద్వా నాయకులు రేణుక,