పెద సుబ్బారావుకు ఘన నివాళులు

అనారోగ్యంతో గురువారం మృతి చెందిన సిపిఎం సీనియర్‌ సభ్యులు పోపూరి సుబ్బారావు అంత్యక్రియలు శుక్రవారం ఉదయం యడ్లపాడులోని సొంత వ్యవసాయ పొలంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. పార్టీలో నాలుగు దశాబ్ధాలపాటు క్రీయాశీలకంగా పనిచేసినా పోపూరి సుబ్బారావు మృతి వార్త తెలిసిన వెంటనే చిలకలూరిపేట డివిజన్‌లోని పలు గ్రామాల నుండి సిపిఎం కార్యకర్తలు ఆయన మృత దేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర రైతు నాయకులు పోపూరి రామారావు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రామంలో అనేక విషయాల్లో, వివిధ సందర్భాల్లో సేవలు చేసి, పార్టీలో అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త సుబ్బారావు అని నివాళి అర్పించారు. చిలకలూరిపేట డివిజన్‌ సిపిఎం కన్వీనర్‌ పోపూరి సుబ్బారావు, సిపిఎం డివిజన్‌ కమిటీ సభ్యులు ముద్దన వెంకటేశ్వర్లు, పి.వెంకటేశ్వరరెడ్డి, కొమ్మినేని నాగేశ్వరరావు, నూతలపాటి కాళిదాసు, పోపూరి శివరామయ్య, మానుకొండ ఉపేంద్ర, మావోయిస్టుల నాయకులు నల్లపాటి రామారావు, ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎంవి.రమణ, మహిళా మండలి నాయకులు చాగంటి అమరమ్మ, నల్లబోతు మాణిక్యమ్మ తదితరులు ఆయన మృత దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.