పెంచినజీతాలఅమలుఏదీ?:CITU

పెంచిన జీతాలు, ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల మున్సిపల్‌ కార్మి కులు ధర్నాలు నిర్వహించారు. విశాఖలో జివిఎంసి కార్యా లయం వద్ద మున్సిపల్‌ కార్మికులు ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.11వేలు అమలు చేయాలని, ప్రతి నెలా 5వ తేదీకే వేతనాలు చెల్లించాలని, గుర్తింపు యూనియన్‌ 41 ప్యాకేజీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి అంజిబాబు మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా 16 రోజుల సమ్మె కాలాన్ని సెలవు దినంగా పరిగణిస్తూ వేతనం ఇవ్వాలన్నారు. అనంతరం ఉపకమిష నర్‌ పివి రామలింగేశ్వర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.