పార్లమెంటు ఎదుట ధర్నా:AIKS

ఆత్మహత్యలు పాల్పడిన రైతుల కుటుంబ సభ్యులు జంతర్‌ మంతర్‌ వద్ద ఆగస్ట్‌ ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు పార్లమెంటు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా చెప్పారు.గత రెండున్నర దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా రైతాంగం చెప్పనలవి కాని బాధలను అనుభవిస్తోందని, వ్యవసాయ రంగం కుదేలయిందని మొల్లా విమర్శించారు. రైతాంగం ఆత్మహత్యలకు ఈ విధానాలే కారణమన్నారు. అధికారిక అంచనాల మేరకు ఈ కాలంలో మూడున్నర లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు కనీసం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల రుణాల మాఫీ , కేరళ తరహాలో రుణ ఉపశమన కమిషన్‌ ఏర్పాటును ఈ ధర్నాలో డిమాండ్‌ చేయనున్నారు .