పారిశుధ్య కార్మికుల ధర్నా

మున్సిపల్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం కార్యాలయం నుండి పురపాలక సంఘం వరకు వారు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, కార్మికులకు ప్రభు త్వమే వేతనాలు చెల్లించాలని, ప్రజల పై భారాలు చేసే యూజర్‌ ఛార్జీలను విరమించాలన్నారు. 279 ఇఒని రద్దు చేయాలని వారు డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో సిఐటియు నాయకులు పద్మనాభయ్య, ఎస్‌కె. రియాజ్‌, సాంబశివయ్య, సుధాకర్‌రావు, కార్మికులు పాల్గొన్నారు. నాయుడుపేట: పారిశుధ్య కార్మికుల పొట్ట కొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నెం. 279 ఉందనీ, దాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌. ముకుంద డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాతికేళ్లుగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరిత జిఒ లను విడుదల చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిఒను రద్దు చేయడంతో పాటు పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చంచారు. అనంతరం కమిషనర్‌ ప్రసాద్‌ నాయుడు, చైర్‌పర్సన్‌ మైలారి శోభారాణిలకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పెంచలయ్య, మస్తానయ్య, పోలమ్మ, ఆదెమ్మ పాల్గొన్నారు.