పట్టణ ప్రాంత సమస్యలపై రాష్ట్ర సదస్సు

రాష్ట్రంలో ప్రజానుకూల, నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలతో కలసిరావాలని అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులకు, సంఘాలకు పట్టణ ప్రాంత సమస్యలపై విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల పై పన్నుల భారం లేకుండా ఉండాలని, స్థానిక సంస్థ లకు 40 శాతం రాష్ట్ర ఆదాయాన్ని బదలాయించాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 16 నుంచి 24 వరకు అన్ని నగరాల్లో సమస్యల పరిష్కారానికై పాదయాత్ర నిర్వహించాలని, అందరికీ ఇళ్లు కోసం మండల కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలని సదస్సులో నిర్ణయించారు. సెప్టెంబర్‌ 15న 'మహాగర్జన' పేరుతో విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తామన్నారు.