తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఇంతెందుకు..?

జూన్‌ లోగా నిర్మాణం పూర్తి చేయాలనుకున్న తాత్కాలిక సచివాలయంపై గందరగోళం నెలకొంటోంది. రోజుకో గ్రామం, పూటకో స్థలంతో ప్రభుత్వం ఈ పరిస్థితిని సృష్టిస్తోంది . అసలు నిర్దిష్ట సమయం లోగా సచివాలయం పూర్తవుతురదా? అనే అనుమా నాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి కేటాయిరచాల్సిన స్థలాన్ని రెట్టిరపు చేస్తూ ప్రభుత్వం తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మురదుగా 20 ఎకరాల్లో సచివాలయాన్ని నిర్మిరచాలని నిర్ణయిరచారు. వెలగపూడిలో ఇప్పుడు ఏకంగా ఆ విస్తీర్ణాన్ని 45 ఎకరాల వరకు పెరచుతూ ఉత్తర్వులిచ్చారు. ముందు 20 ఎకరాలని, పబ్లిక్‌ సౌకర్యాల పేరిట దీన్ని 45 ఎకరాలకు పెంచడం ప్రశ్నార్థకమవుతోంది.