తాగునీటి సమస్యపై దృష్టేదీ?

రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ఈ నెల 3, 4 తేదీల్లో విజయవాడలో జరి గిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ తీర్మానాలను రాష్ట్ర కార్యదర్శి పి. మధు మంగళవారం నెల్లూరులో విడుదల చేశారు. నిజాలను కప్పిపుచ్చి సమస్యలను పక్కదారిపట్టించేలా బూటకపు ప్రచా రాలకు దిగుతున్న ప్రభుత్వ తీరును సీపీఐ(ఎం) తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా తగిన సహాయ చర్యలు చేపట్టలేదని ఆ పార్టీ పే ర్కొంది. వివిధ రంగాల కార్మికులు తమ సమస్యల పరి ష్కారానికి ఉద్యమబాట పట్టారని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన హామీ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.30 వేల కోట్లు రావాల్సి ఉందనీ, కేవలం రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీపీఐ(ఎం) సూచించింది.