జిఎస్‌టి బిల్లును తిరస్కరించడమే మార్గం:మధు

రానున్న పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న భూ సేకరణ చట్టానికి సవరణ బిల్లుతో పాటు, ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సవరణ, సరుకులు, సేవల బిల్లు (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ -జిఎస్‌టి) బిల్లు వీటిలో కీలకమైనాయి. పన్నుల విధానంలో పెనుమార్పులు తీసుకువచ్చే జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేస్తోందని, రాష్ట్రాల ప్రభుత్వాలతో, ఆర్థిక శాఖ మంత్రులతో అనేక దఫాలు చర్చించి,కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ స్థూలంగా అంగీకరించారంటూ ముందడుగు వేయడానికి కేంద్రం సిద్దమైందని అన్నారు..