జన్మభూమి కమిటీలను రద్దుచేయాలి

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో అన్ని మండల తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహశీలార్లకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ జన్మభూమి కమిటీ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. సంక్షేమ పథకాలను టిడిపి అనునూయులు మాత్రమే లబ్ధిపొందేలా ప్రభుత్వం కుట్ర పూరితమైన కక్షసాధింపుతో ఈ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. జన్మభూమి కమిటీల వల్ల అర్హులకు సంక్షేమ పథకాలకు ఆందని ద్రాక్షగా మారాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కమిటీలను తొలగించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం తహశీల్దారు శ్రీనివాసలుకు వినతి పత్రాన్ని అందజేశారు. జన్మభూమి కమిటీలను రద్దుచేయకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిహెచ్‌.రాయుడు, ముష్కిన్‌, బాబు, ప్రకాశ్‌, నాగప్ప, వలి, నూరుల్లా, లక్ష్మినారాయణ, రామ్మోహన్‌, ఐద్యా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లకీëదేవి