గ్రీన్‌జోన్‌పై 29 వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ తొల‌గించకుంటే సిఎం క్యాంప్‌ కార్యాయం ముట్టడి అడ్రస్‌లేని అవగాహన సదస్సులు

  అఖిపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఎ కార్యాయాన్ని ముట్టడిరచిన  రైతు

    కృష్ణాజిల్లాలోని గ్రామాల‌ను గ్రీన్‌జోన్‌ నుంచి మినహాయించేందుకు అఖిపక్ష నేతలు ఈ నె 29వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. ఆలోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయకపోతే విజయవాడలో సిఎం క్యాంప్‌ కార్యాయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జల‌వనరుశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతు పక్షాన నిబల‌డతారో, సింగపూర్‌ కంపెనీల‌కు వత్తాసుగా ఉంటారో స్పష్టం చేయాల‌ని డిమాండు చేశారు. కృష్ణాజిల్లా మైవరం, జి కొండూరు మండలాను గ్రీన్‌జోన్‌ నుంచి తొల‌గించాంటూ రైతు రాజధాని ప్రాంత ప్రాధికారసంస్థ (సిఆర్‌డిఎ) కార్యాయాన్ని సోమవారం ముట్టడిరచారు. గ్రీన్‌జోన్‌లో చేర్చటంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సిఆర్‌డిఎ కార్యాయంలోకి చొచ్చుకెళ్లారు. రాజధాని ప్రాంత సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆధ్వర్యంలో రైతులు ముట్టడికి తరలివచ్చారు. సిఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ, వ్యవసాయ పరిరక్షణ జోన్‌ పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 15 ల‌క్ష ఎకరాలో అభివృద్ధి స్తంభించిపోయిందన్నారు. సింగపూర్‌, జపాన్‌ కంపెనీల‌ ప్రయోజనాల‌ కోసమే ప్రభుత్వం క్షలాది ఎకరాల‌ను గ్రీన్‌జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చిందని విమర్శించారు. తక్షణమే వ్యవసాయ భూముల‌ను గ్రీన్‌జోన్‌ నుంచి మినహాయించాల‌ని డిమాండు చేశారు. ఈ నె 29వ తేదీలోగా ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాల‌ని, లేకపోతే అఖిల‌పక్షం ఆధ్వర్యంలో సిఎం క్యాంప్‌ కార్యాల‌యాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రీన్‌జోన్‌పై రైతుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని సిఆర్‌డిఎ కమిషనర్‌ శ్రీకాంత్‌ ఇచ్చిన హమీ ఎక్కడా అము కావటంలేదన్నారు. మరోవైపు పేద సాగులో ఉన్న 50 వే ఎకరా అటవీ భూముల‌ను డీనోటిఫై చేయించటం శోచనీయమన్నారు. ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల‌ కోసం రైతు ప్రయోజనాల‌ను దెబ్బతీస్తోందని విమర్శించారు. రెండు జిల్లాల‌ రైతు లు ఎదుర్కొంటున్న సమస్యల‌పై జవనరుశాఖ మంత్రి దేవినేని ఉమా స్పందించాల‌ని ఆయన డిమాండు చేశారు. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ, రైతు భూముల‌పై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి ఉమా సొంత నియోజకవర్గంలోనే పచ్చని పంట పొలాను గ్రీన్‌జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చినా స్పందించటంలేదని విమర్శించారు. గ్రీన్‌జోన్‌ పేరుతో ప్రభుత్వం రైతుల‌ను నట్టేట ముంచిందన్నారు. గ్రీన్‌జోన్‌పై రైతుతో కనీసం చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవటం శోచనీయమన్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని, లేకపోతే రైతులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షు వై కేశవరావు, సిపిఎం జిల్లా నాయకుడు ఎం ఆంజనేయు, మైవరం డివిజన్‌ కార్యదర్శి టి రాంబాబు, జి కొండూరు మండ కార్యదర్శి సిహెచ్‌ శివ, జి కొండూరు ఎంపిపి వేముకొండ తిరుపతిరావు, జడ్‌పిటిసి సభ్యుడు కాజా బ్రహ్మయ్య, వైసిపి నాయకు కాజా రాజ్‌కుమార్‌ తదితయి పాల్గన్నారు.