గోల్ఫ్‌కోర్టులు,విల్లాల కోసమే భూసేకరణ..

రాజధాని కోసమే భూ సేకరణ చేస్తున్నామంటున్న ప్రభుత్వ మాటల్లో వాస్తవం లేదని సిపిఎం క్రిడా ప్రాంత కమి టీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు గురువారం విలేకరుల సమా వేశంలో విమర్శించారు. రైతుల భూములను లాక్కొని సింగ పూర్‌, జపాన్‌ తదితర కంపెనీల వ్యాపారాలకు అప్పగించ డానికే బలవంతపు భూ సేకరణని, అందుకు ముఖ్యమంత్రి బెదిరించడం అప్రజాస్వామికమని ఆందోళన వ్యక్తం చేశారు. అది గోల్ఫ్‌ కోర్టులు, ధనవంతులకు విల్లాల నిర్మాణం కోసం సేకరించే భూమి మాత్రమేనని విమర్శించారు. అభివృద్ధి కోసం భూములు సేకరించకపోతే ఏలా అని మంత్రి యనమ ల రామకృష్ణుడు అంటున్నారని, ఇది ఎవరి అభివృద్ధి కోసమని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ చెల్లదన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారమంటూ, కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను అనుసరించి జారీ చేసిన 166 జీవో ఎలా చెల్లు తుందని ప్రశ్నించారు. 2013 చట్ట ప్రకారం బహుళ పంట లు పండే భూములను సేకరించకూడదన్నారు. సామాజిక ప్రభావా లను అంచనా వేయకుండా భూ సేకరణ చేయకూడ దని తెలిపారు. ప్రభుత్వ ప్రాజెకులైతే 70శాతం, ప్రయివేటు ప్రాజెక్టులకు 80 శాతం మంది రైతులు ఒప్పుకుంటునే భూసే కరణ చేయాలనే నిబంధన ఉందని గుర్తు చేశారు.