క్వింటాకు రూ.6 వేల మద్దతు ధర కల్పించాలి..

గిరిజన రైతులు పండిస్తున్న పత్తి పంటకు క్వింటాకు రూ.6 వేల మద్దతు ధర కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి నాయకుడు మర్లపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో మిడియం బాబూరావు మాట్లాడుతూ పత్తి క్వింటాకు రూ.7,762 కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిపుణులు సిఫార్సు చేసినా కేంద్రం రూ.4,100 మాత్రమే ప్రకటించిందన్నారు. ప్రయివేటు వ్యాపారులు కుమ్మక్కై క్వింటాకు రూ.2,500 నుంచి రూ.3,500 మధ్య కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.