కౌల్దారు రుణాల్లో మాట తప్పిన ప్రభుత్వం : సిపిఎం

జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌలురైతులకు వెంటనే పంటరుణాలు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. అమరావతి కళ్లం బ్రహ్మయ్య స్మారకభవనంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది కౌలురైతులుండగా కేవలం 30 వేల మందికే కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారని అన్నారు. పది వేల మందికి మాత్రమే పంటరుణాలు మంజూరు చేశారని అన్నారు. ఎన్నికల ముందు ప్రతి కౌలురైతుకు గుర్తింపుకార్డులిచ్చి పంటరుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాటతప్పిందని అన్నారు. బ్యాంకులో రుణాలు మంజూరుకు ఆటంకం కలిగిస్తున్నారని జిల్లా ప్రభుత్వం జోక్యం చేసుకుని రుణాలు మంజూరు చేయించాలని కోరారు. గుంటూరు మార్కెట్‌యా ర్డులో వ్యవసాయ మార్కెట్‌ పద్ధతి ప్రకారం కొనుగోలు చేస్తామని ప్రకటించారని దీంతో వ్యాపారులు నెలరోజుల నుంచి సమ్మె చేస్తున్నారని వెంటనే ఆసమస్యను పరిష్కరించి కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. లక్షలాది ఎకరాల భూములను రైతుల వద్దనుంచి సేకరిస్తూ వాటిని కార్పొరేట్‌ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శిం చారు. అనంతపురం నుండి అమరా వతి ఎక్స్‌ప్రెస్‌లైన్‌ నిర్మాణానికి రూ.26 వేల ఎకరాల భూములను సేకరిస్తున్నారని 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరి హారం ఇవ్వాలని కోరారు. సిపిఎం ఏరియా కార్యదర్శి బి.సూ రిబాబు మాట్లాడుతూ క్రోసూరు మండలం బయ్యవరంలో దళితులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.