కరువు కోరల్లో కర్నూల్..

జిల్లాలో వర్షాభావ పరి స్థితుల వల్ల వ్యవసాయం దెబ్బ తిందని, ఉపాధి కూలీలకు పనులు దొరకడం లేదని, ఈ నేపథ్యంలో కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సుదర్శనవర్మ స్మారక భవనంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో కరువు పరిస్థితి నెలకొంటే ముఖ్య మంత్రి విదేశీ పర్యటలకు ఎక్కువ సమయం కేటాయి స్తున్నారని అన్నారు. వేల, కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వెచ్చించి చేపట్టిన హంద్రీనీవా పనుల్లో మామూళ్ల కోసం నాణ్యతను పట్టించు కోకుండా నాసిరకంగా నిర్మాణం చేపటా ్టరన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీరు ఉంచాలని, జిల్లాలోని లిప్ట్‌ ఇరిగేషన్‌కు నీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2014లో సంబంధించిన కరువు, నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. గురురాఘవేంద్ర, హంద్రీనీవా, ముచ్చుమర్రి, జుపాడుబంగ్లా1, 2, కొత్తపల్లిలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలను వెంటనే పూర్తి చేయా లన్నారు. కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని, జిల్లాలో నెలకొన్న సాగు, తాగు నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.