కడప కలెక్టరేట్ ముట్టడి..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు పీడిత ప్రాంత మైన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం  ఆధ్వర్యం లో  పెద్దఎత్తున కడప కలెక్టరేట్ను ముట్టడించారు.ధర్నాకు వస్తున్న ప్రజలనూ, పార్టీ కార్యకర్తలనూ, నాయకులనూ పోలీ సులు అడ్డుకుని అరెస్టులు చేశారు. ధర్నానుద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ..రాయలసీమలో విద్య, ఉపాధితోపాటు వర్షాలు లేక అన్నిట్లోనూ వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిషన్‌ తన రిపోర్టులో పేర్కొందని గుర్తు చేశారు. కడప జిల్లాకు రూ.50 కోట్లు ఇచ్చామని చెపుతున్నారని, ఈ మొత్తం పడిపోయిన స్కూల్‌ బిల్డింగులు రిపేరు చేయడానికి కూడా చాలవని విమర్శించారు. రాయలసీమ ప్రాంత సమ స్యల పరిష్కారం కోసం ప్రజలను సన్నద్దం చేసేందుకు సిపి ఎం నడుం బిగించిందని పేర్కొన్నారు. రూ.1,200 కోట్లు పట్టిసీమకు ఖర్చు చేస్తున్నారని, దీనివల్ల రాయలసీమకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రహక్కు అని పోరాడి సాధించుకున్నామని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పా టు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కంపెనీలు ముందుకు వస్తున్నా ప్రధాని, ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు.