కడపలో ఉక్కుపరిశ్రమ కోసం ఆందోళన..

 కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళంపై కలెక్టర్‌ సమాధానం చెప్పాలని నినదించారు. కలెక్టర్‌ తీరును నిరసిస్తూ వాహనాన్ని కదలకుండా సిపిఎం శ్రేణులు భైఠాయిం చాయి. ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించారు. ఈ బృం దాలు కలెక్టరేట్‌లోకి చేరుకున్న వెంటనే ఉద్యమకా రులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.కలెక్టర్‌ సభాభవన్‌లోని గ్రీవెన ్‌సెల్‌ కార్యక్రమంలో ఉన్నప్పటికీ స్పందించక పోవడం పట్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా భవనం వద్దకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ధర్నానుద్దేశించి జి.ఓబులు మాట్లాడుతూ.. రాయలసీమ పట్ల వివక్ష చూపడం తగదన్నారు. ముఖ్యమంత్రి 120 జిఒ, పట్టిసీమకు 1350 కోట్లు, గోదావరిలో మునిగేందుకు 1400 కోట్లు, ప్రకాశం జిల్లాను కలుపుకుని రాయలసీమ ప్రాజెక్టులకు 550 కోట్లు మాత్రమే కేటాయించడం వెనుక దాగిన కుట్రను విడమరిచి చెప్పారు. కడపలో ఉక్కు పరిశ్రహ ఏర్పాటు విషయాన్ని సెయిల్‌ తిరకాసు పెడుతోందని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికా లేక కోస్తా ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.