ఒక్క టెండరు కూడా ఖరారు కాలేదు..!

రాజధాని పనులకు ఇంతవరకు ఒక్క టెండరూ ఖరారు చేయలేదు. కేవలం కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియ మినహా ఇతర టెండర్లను ఖారారు చేయలేదు. అన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. రాజధానికి అనుసంధాన ప్రధాన రహదారికే ఇంతవరకు స్పష్టత లేదని అధికారులే వాపోతున్నారు. కన్సల్టెంట్లు కూడా రాజధాని కేంద్ర ప్రాంతం నుండి కొండవీటివాగు స్లూయిస్‌ వరకూ ప్లానింగ్‌ ఇచ్చారు. అక్కడి నుండి జాతీయ రహదారికి అనుసంధాన రహదారిని ఫైనల్‌ చేయలేదు. అధికారులు మాత్రం మణిపాల్‌ ఆస్పత్రి వెనుక భాగంలోనూ, వడ్డేశ్వరం సమీపంలోనూ భూ పటుత్వ పరీక్షల కోసం పిల్లర్లు వేసి వదిలేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రోడ్డు ఎక్కడ వేయాలనేది స్పష్టం చేయలేదు. రోడ్లకు సర్వే చేసిన కంపెనీ ఇటీవల మూడు ప్రతిపాదనలు చేసింది. మణిపాల్‌ ఆస్పత్రి నుండి కరకట్టమీదుగా ఒకటి, దిగువ భాగంలో మరొకటి, క్రిస్టియన్‌పేట రోడ్డు వడ్డేశ్వరం నుండి నులకపేట మీదుగా మరొకటి రోడ్లు వేయాలనేది ఆ ప్రతిపాదన.