ఏపీ సీడ్‌క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌...

 ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అనేక అంశాలు పొందిపరిచారు. బ్రహ్మ స్థానంలో ఏమేమి ఉంటాయి, సచివాలయం ఎక్కడ నిర్మిస్తారు.. హైకోర్టు ఎక్కడ.. తదితర అంశాలు అందులో పొందిపరిచారు.
అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సోమవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నారు. నవ్యాంధ్ర రాజధాని రూపురేఖలన్నీ మాస్టర్‌ ప్లాన్‌లో పొందిపరిచారు. అంతకు ముందే ఈశ్వరన్‌ అమరవాతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను చంద్రబాబుకు అందజేశారు. ఇప్పుడు సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అందజేయనున్నారు. సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అత్యంత అధునాతనమైనటువంటి వ్యవస్థలన్నీ ఇందులో రూపుదిద్దుకోబోతున్నాయి. ఆధునాతన సౌకర్యాలతోపాటు.. ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు.