ఏకపక్షంగా చట్టాల సవరణ: గఫూర్‌

మోడీ, చంద్ర బాబు ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ దుయ్య బట్టారు. తిరుపతిలోని ఎంబి భవన్‌లో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల క్లస్టర్ల సమావేశంలో ఆయన ప్రసం గించారు. సెపెంబర్‌ 2న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వ త్రిక సమ్మె ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఎన్నో త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకొన్న చట్టాలను మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా సవరణకు పూనుకుందన్నారు. రాజస్థా న్‌లో బిజెపి ప్రభుత్వం కీలకమైన పారిశ్రామిక వివాదాల చట్టం, ఫ్యాక్టరీ చట్టం, కాంట్రాక్టు లేబర్‌ చట్టం, కనీస వేతనాల చట్టంను సవరించి కార్మికుల హక్కుల ను కాలరాసిందన్నారు. చంద్రబాబు ప్రభు త్వం కూడా కార్మిక చట్టాల సవరణ బిల్లును మార్చి 25న ఆమోదించిందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపి బిల్లు విషయంలో మౌనం పాటించిందన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం వంద మంది పని చేస్తున్న పారిశ్రామిక సంస్థల్లోనూ కార్మికులను తొల గించాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమ న్నారు. ఈ చట్టాన్ని సవరించడం ద్వారా ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికుల ను తొలగించడానికి (హైర్‌ అండ్‌ ఫైర్‌) యాజమాన్యాలకు అవకాశం వచ్చింద న్నారు. ఇష్టారాజ్యంగా లాకౌట్లు చేసుకోవడానికి అనుమతి వచ్చిందన్నారు. ఫ్యాక్ట రీ చట్ట సవరణ కారణంగా పెద్ద ఎత్తున చిన్న పరిశ్రమలు లేకుండా పోతాయ న్నారు అలాగే ఓవర్‌ టైం, జాతీయ పండుగల సెలవులు, ఆర్జిత సెలవులు వంటి సదుపాయాలను కార్మికు లు కోల్పోతారని పేర్కొన్నారు. కాంట్రాక్టు లేబర్‌ యాక్ట్‌ సవరణతో 50 మంది లోపు కాంట్రాక్టు కార్మికులను నియమించిన యాజమాన్యానికి ఇది వర్తించద న్నారు. ఫలితంగా కాంట్రాక్టు కార్మికులు మరింత దోపిడీకి గురవుతారన్నారు. నరేంద్రమోడి, చంద్రబాబు ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు కార్మిక సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సిఐటియు పూర్తి మద్దతు ఇస్తోందన్నారు.