ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ప్రజాభిప్రాయ ఓటింగు పెట్టండి

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలా? వద్దా? అనే విషయమై దమ్ముం టే చంద్రబాబునాయుడు 'ప్రజాభిప్రాయ ఓటింగు' పెట్టాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సవాల్‌ విసిరారు. 'మెజార్టీ ప్రజలు ఎయిర్‌పోర్టు కావాలంటే కట్టుకోండి. లేదంటే తోకము డిచి ఎయిర్‌పోర్టు ప్రతిపాదన విరమించు కోండి' అని సూచించారు. రాష్ట్ర రాజధానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సరిపోయినప్పుడు, విశాఖలో ఎయిర్‌పోర్టు ఉండగా ఇక్కడ మరొకటి ఎందుకని ప్రశ్నించారు. ఇది భోగాపురంలోని పెద్దల భూములకు ధరలు పెరగడానికి తప్ప, ప్రయాణికుల కోసమో, ప్రజల కోసమో కాదని విమర్శించారు. అభివృద్దే అనుకుంటే.. ఈ ప్రాంతంలోని మంత్రి అయ్యన్నపాత్రుడు భూములు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాలైన కౌలువాడ, కంచేరు, గూడెపువలసల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు తదితరులతో కలిసి ఆయన పట్యటించారు.