అభివృద్ధి కేంద్రీకరణ తగదు:BVR

రాజధాని నిర్మాణం పూర్తిగా కార్పొరేట్ల కోసమే చేస్తున్నట్లుందని, రైతుల ప్రస్తావన, వారి సంక్షేమం కనిపించడం లేదని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలను గ్రీన్‌ఫీల్డు పేరు తో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుం డా ఏకపక్షంగా ముందుకు వెళుతూ వ్యాపార రాజధానిగా మారుస్తున్నారన్నా రు. రాజధాని కార్పొరేట్ల కోసమా ? ప్రజల కోసమా ? అనే అంశంపై బుధవారం వేదిక ఫంక్షన్‌ హాల్లో సిపిఎం ఆధ్వర్యాన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ వ్యాపారం కోసమే రైతుల వద్ద వేల ఎకరాల భూములు తీసుకున్నారని తెలిపారు. వారి లాభాల కోసం రాజధాని చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల భూములను గ్రీన్‌ఫీల్డుగా మార్చారని తెలిపారు. దీనివల్ల అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ నగరంలో చేసిన తప్పునే ఇక్కడా చేస్తున్నారని వివరించారు.