స‌మాజాన్ని మేల్కొ‌లిపేది సాహిత్యమే

కులాలు, మతాలు, మతతత్వం వంటి అంశాలు ప్రాబల్యం చూపుతున్న నేటి పరిస్థితుల్లో సమాజాన్ని మేల్కొలిపేది సాహిత్యమేనని సాహిత్య ప్రస్థానం ఎడిటర్‌, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం స్థానిక రోటరీ క్లబ్‌ హాల్లో జరిగింది. ప్రముఖ కవి డాక్టర్‌ అదేపల్లి రామ్మోహనరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఎంఎల్‌సి రాము సూర్యా రావుతోపాటు తెలకపల్లి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రవి మాట్లా డుతూ సాహిత్యం నేటి యువత రాన్నీ, విద్యార్థులనూ ఆకట్టు కునేలా ఉండాలన్నారు. 
సమాజానికి ప్రతి ఒక్కరూ అక్షరంతోగానీ, బోధనతో గానీ సేవలందిం చాలన్నారు. కుల, మతతత్వాలు, నిరంకుశత్వాలను నేటి పాలకులు పెంచి పోషిస్తున్నారన్నారు. నిషేధాలు, నిర్బంధాలు రెండు రాష్ట్రాల్లో పెరిగిపో యాయని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాలను విడదీసి పంచుకోవచ్చు నేమోగాని 56 తెలుగు అక్షరాలను ఎవరూ విడదీయలేరన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పాలకులు ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్న పరిస్థితుల నడుమ సాహి త్య కృషి మరింతగా పెరగాలన్నారు. సాహిత్యం జనరంజకంగా మారాలని కోరారు. ఎక్కడైతే సాహితీమిత్రులు, రచయితలు, కవులు సమా లోచనలు జరుపుతారో అక్కడ సంస్కారం పుట్టి సమాజానికి మంచి జరుగుతుందన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ ఏర్పడ్డాక ప్రతినెలా సాహిత్య హేళ కార్యక్ర మం కాకినాడలో నిర్వహించడం శుభపరిణా మమ న్నారు. గోదావరి జిల్లాల పేరు విన్నప్పుడు సోమసుందర్‌, అదేపల్లి వంటి మహా కవులంతా గుర్తొస్తారన్నారు. సంఘ సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్య్ర, సామ్యవాద ఉద్యమాలకు పుట్టినిల్లు అని కొనియాడారు. రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ నేటి రాజకీయాలు విశ్లేషణలకు అందని వికృతంగా తయారయ్యాయని గుర్తు చేశారు. తెలుగు మీడియా అంటే ఒక మోడీ, ఇద్దరు చంద్రులు, ఒక జగన్‌ అంటూ విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీడియాపై మరింత బాధ్యత పెరగాల్సి ఉందన్నారు. సాహిత్యం, సంప్రదాయాలు, సంస్కృతులను కాపాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.