సీమ సమస్యలపై చలో అసెంబ్లీ..

 రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నగరంలో వామపక్షాల కార్యకర్తలు కదంతొక్కారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవడంతో ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. వామపక్షాల నేతృత్వంలో 15 రోజుల పాటు సీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బస్సుయాత్ర సాగింది. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ-సాగునీటి ప్రాజెక్టులు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి.. డిమాండ్లతో వామపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనలో పాల్గొనడానికి సీమ జిల్లాల నుంచి వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు.