ప్రత్యేక హోదా సాధనకై రాష్ట్రవ్యాప్త బంద్

ప్రత్యేక హోదా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆగస్టు 2న జరపబోయే బంద్ లో పాల్గొనాలని కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ . నరసింగరావు ప్రజలకు  పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 అమలు చేయవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్రంలో అధికారానికి వచ్చిన బిజెపి గత రెండు సంవత్సరాలు నుంచి కుంటిసాకుతో విభజన చట్టంలోని ఈ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా జాప్యం చేసింది.విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదు. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధంకావడంలేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు అతితక్కువగా కేటాయించి ఈ పార్లమెంట్‌ సమావేశంలో నాబార్డు ద్వారా నిధులు ఇస్తామని చెబుతున్నారు. ద్రవ్యలోటు పూడ్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర - రాయలసీమలోని 7 జిల్లాలకు సంవత్సరానికి 7వేల కోట్లు యివ్వాల్సి వుండగా 700 కోట్లు మాత్రమే ఇచ్చింది. రాష్ట్ర రాజథానికి అవసరమైన నిధులు ఇవ్వడంలేదని విమర్శించారు