ప్రకాశం బ్యారేజీ వద్ద రైతుల రాస్తారోకో..

రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణపై రోజు రోజుకు నిరసనలు పెరుగుతున్నాయి. పలు గ్రామాల్లో రైతులు వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతులు సమావేశమై ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ, భూసేకరణను వ్యతిరేకిస్తూ నేడు ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ మీద రాజధాని గ్రామాల రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులతో రాస్తారోకో నిర్వహించారు.  ఈనెల 24న రాజధాని గ్రామాల్లోని క్రిడా కార్యాలయాలను ముట్టడించాలని, 25న రాజధాని ప్రాంత గ్రామాల్లో బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు..