పోరుమామిళ్లలో సిపిఎం పోరు..

పేదల ఇళ్ళను తొలగించడానికి వస్తే ధైర్యంగా ఎదుర్కో వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు పేదల ను కోరారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగస ముద్రం పంచాయతీలోని 54 ఎకరాల ప్రభుత్వ బంజరు భూ ముల్లో బుధవారం వందలాది మంది పేదలు గుడిసెలు వేశా రు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సర్వే నెంబర్‌ 1263లోని 54 ఎకరాల ప్రభుత్వ బంజరులో ఇంటి స్థలం కోసం పేదలు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు నిర్లక్ష్యం వహించారని, దీంతో ఓపిక నశించి ఆ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని ఆయన డి మాండ్‌ చేశారు. ప్రతి కుటుంబానికీ రెండున్నర లక్షల రూపా యలతో పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలన్నారు. ప్రభుత్వం 13 జిల్లాల్లో కార్పొరేటర్లకు 15 లక్షల ఎకరాలు ఉచితంగా ధారాదత్తం చేసిందని విమర్శించారు. పేదలు ఇళ్లు నిర్మించు కోవడానికి మూడు సెంట్లు అడితే అక్రమ కేసులు పెడుతు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటానని చంద్రబాబు వాగ్దానాలు చేశారని, అధికారంలోకొచ్చాక వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలొచ్చినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదన్నారు. బద్వేలు నియోజకవర్గంలో టిడిపి పేదల భూ పోరాటానికి మద్దతు ఇవ్వాలనీ, లేకపోతే దానికి పుట్టగతులుండవని హెచ్చరించారు