దళితులకు సామజిక న్యాయం దక్కేవరకూ పోరాడదాం..

మనదేశానికి స్వాతంత్రం వచ్చి 68సంవత్సరాు అవుతున్నా దళితు స్థితిగతుల్లో పెద్దగా మార్పు రాలేదు. అంటరాని తనం, దాడు, స్త్రీపై అత్యాచారాు, మానభంగాు కొనసాగుతూనే వున్నాయి. అందుచేతనే రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ 125 జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం కనీసం నాుగు రోజు నిర్వహించి దళిత సమస్యపై చర్చించి పరిష్కారానికి కొన్ని చట్టాు రూపొందించాని సిపియం డిమాండ్‌ చేస్తున్నది. 
ప్రయివేటు రంగం రోజు రోజుకి పెరిగి పోతున్నది. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రయివేటీకరణ జోరు మరింత పెంచుతున్నది. దీనివ్ల ప్రభుత్వ రంగంలో ఉద్యోగాు తగ్గిపోతున్నాయి. కనుక ప్రయివేటు రంగంలో దళితుకు రిజర్వేషన్లు కల్పించాని అందుకు పార్లమెంటు వెంటనే చట్టం చేయాని సిపియం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో దళిత సంఘాు, రాజకీయ పార్టీు ముఖ్యంగా సిపియం పార్టీ పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం రూపొందించింది. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాపిత ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం రూపొందించాని సిపియం పార్టీ దేశవ్యాపితంగా ప్రచారం చేస్తున్నది. అదే విధంగా దళితు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాను వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు భర్తీ చేయాని సిపియం పార్టీ డిమాండ్‌ చేస్తున్నది.