కనీస వేతనాల చట్టాన్నిసవరించండి

రాష్ట్రంలో తక్షణమే కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. పదేళ్లుగా కనీస వేతనాల చట్టాన్ని సవరించలేదన్నారు. దీంతో ప్రతి నెలా కార్మికులు రూ.500 కోట్లు నష్ట పోతున్నట్లు తెలిపారు. 65 షెడ్యూల్స్‌లోని కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్లు, విఆర్‌ఎ, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.