ఆర్టికల్స్

Thu, 2015-01-08 13:15

అర్ధఫాసిస్టుల మారణకాండకు, భూస్వాముల హింసాకాండకు చిరునామాగా మారిన బెంగాల్‌లో బిగిసిన పిడికిళ్లు వారివి! వినిపించిన విప్లవ నినాదాలు వారివే! పీడిత, తాడిత ప్రజానీకపు విముక్తే లక్ష్యంగా ఎర్రజెండా ఎత్తిన ధీశాలులు వారు! దోపిడితో , పీడనతో విసిగిపోయి, బతుకులింతే అంటూ నిరాశ, నిస్పృహలో మునిగిపోయిన నిరుపేద ప్రజానీకపు గుండెల్లో ధైర్యాన్ని నింపి, పోరుబాట నడిపిన మార్గదర్శులు వారు! వారే ముజఫర్‌ అహ్మద్‌, జ్యోతిబసు, ప్రమోద్‌దాస్‌ గుప్తాలు! ఒకరు అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నిర్మిస్తే, మరొకరు అద్బుతమైన పాలనదక్షతతో పేదల ఆకాంక్షలకు పట్టం గట్టి మార్క్మిస్టు మేరునగధీరుడిగా వినుతికెక్కారు. ఇంకొకరు విప్లవానికి వేగుచుక్కగా,కమ్యూనిజానికి నిలువెత్తు రూపంగా...

Pages