ఆర్టికల్స్

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఎవరి కోసం?

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమిష్టి జీవన పద్ధతు లు, సహజీవనం, పారదర్శ కతకు నిలువెత్తు సాక్షులు వారు. వ్యష్టి జీవన పద్ధతులు, పరస్పర అసహనం, కని పించ ని కుట్రలు నేటి పారి శ్రామిక సమాజ లక్షణాలు. బ్రెజిల్‌, పెరూ దేశాలలో వందకుపైగా ఆదివాసి తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూలోని 'ముచి-పిచి' పర్యావరణ పార్కుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతుప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 50-60 వేల సంవత్సరాల నుంచి అటవీ దుంపలు ప్రధాన ఆహార వనరుగా జీవిస్తూ మొక్కజొన్న, బంగాళాదుంప సాగుకు ఈ తెగలు ఎంతో తోడ్పడ్డాయి. తాము వేటాడే జంతువులకు ఎరగా వేసే క్యురారే మొక్క నేడు ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సకు ఔషధంగా...

ప్రత్యేక వంచన పర్యవసానం..

ప్రత్యేక హోదాకు ఏవో రాజ్యాంగ అవరోధాలు ఉన్నాయనేది అర్థ రహితమైన వాదన. పార్లమెంటు ఆమోదిస్తే తప్పక మంజూరు చేయొచ్చు. ప్యాకేజీల వంటివి ప్రభుత్వమే ఇవ్చొచ్చు. ఇటీవలే ఎన్నికలు జరిగే బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు భారీ నిధుల కేటాయింపు ప్రకటించారు. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌కూ ఇవ్వొచ్చు. కాకపోతే బిజెపి రాజకీయ లెక్కలే ఆటంకమవుతున్నాయి. గతంలో తెలంగాణ ఇచ్చి ఓట్లు పొందాలని భంగపడిన కాంగ్రెస్‌లాగే ఇప్పుడు బిజెపి కూడా ఎన్నికల ముందు ప్రకటిస్తే తమకు లాభం అనుకుంటున్నదనేది ఒక వాదన. 
              పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, విశ్వాస రాహిత్యానికి పాల్పడితే ప్రజలు ఎంతగా గాయపడతారో ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు ప్రత్యక్షంగా చెబుతున్నాయి....

సంఘానికి కట్టడి?

విద్యాలయాల్లో ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌, వ్యవస్థాగత లోపాలను నిరోధించలేని ప్రభుత్వం, ఆ దారుణాలపై నిలదీసే విద్యార్థి సంఘాలపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గం. నిన్న రిషితేశ్వరి, నేడు మధువర్ధనరెడ్డి ర్యాగింగ్‌ భూతానికి బలయ్యారు. సునీత మరణం వివాదాస్పదంగా మారింది. ఆ మరణాలపై నిరసనలు మిన్నంటాయి. నాగార్జున వర్శిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంపై పెద్ద ఉద్యమమే లేచింది. కళాశాలల్లో ర్యాగింగ్‌ మహమ్మారి స్వైర విహారం చేస్తున్నా నిద్ర వీడని సర్కారు, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థి సంఘాలను కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వం. రిషితేశ్వరి మరణాన్ని ఎంత దాచి పెట్టాలని చూసినా దాగలేదు సరికదా ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టింది. పాప పరిహారార్థం...

కేరళ తరహా వెల్ఫేర్‌ బోర్డు అవసరం..

రాష్ట్రంలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. దీన్ని రక్షించాలంటే కేరళలో గతంలో వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్ఫేర్‌ బోర్డు తరహాలో ఇక్కడా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో మూడు లక్షల మగ్గాలపైనా, వీటి ఉప వృత్తులపైనా ఆధారపడి సుమారు నాలుగు లక్షల మంది జీవిస్తున్నారు. చేనేత సహకార రంగంలో కార్మికులకు 5 శాతానికి మించి పని దొరకడం లేదు. మిగతా వారంతా ప్రైవేటు రంగంలోని మాస్టరు వీవర్ల వద్ద చేనేత పని చేస్తున్నారు. వీరికి కనీస వేతనం (మజూరీ) లభించడం లేదు. వస్తున్న ఆదాయంతో భుక్తి గడవక అప్పులు చేస్తూ ఆకలి చావులకు, ఆత్మహత్యలకు బలవుతున్నారు. తెలుగుదేశం అధికారానికి వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే ఒక్క అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలోనే 31 మంది మృతి చెందారు.
...

రవాణా కార్మికుల బీమా..ప్రభుత్వ డ్రామా

ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు మేడే రోజున రవాణా కార్మికుల ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించి, కార్మికుల పక్షాన ఉన్నట్లు పత్రికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఈ పథకం ప్రకటన వెనుక కూడా కారణముంది. కార్మికవర్గం తరతరాలుగా పోరాడి, సాధించుకున్న కార్మిక చట్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేసి కార్పొరేట్‌ సంస్థలు కార్మికులను మరింత దోపిడీ చేసుకునే విధంగా మార్పులు చేశాయి. కార్మికులు, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించేందుకు ట్రాన్స్‌పోర్టు కార్మికుల బీమాను ప్రభుత్వం ప్రకటించింది తప్ప, కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కాదు. ఇది కార్మికులకు శాశ్వత పథకం కాదు. ఈ పథకంలో పూర్తిగా అవయవాలు కోల్పోయి అంగవైకల్యంతో ఉన్నవారికి...

ఆహ్వానించదగ్గ పరిణామం..

  ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో శాంతిస్థాపన దిశగా తీవ్రవాదులతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ఒప్పందంతోనైనా దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ అంతమవుతుందని ఆశించవచ్చు. అయితే, ఆశలు, ఆకాంక్షలు వేరు. క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవ పరిస్థితులు వేరు. ఇది సూత్రప్రాయ అంగీకారం మాత్రమేనని ఒప్పందం కుదుర్చుకున్న నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఇసాక్‌-ముయివా) -ఎన్‌ఎస్‌సిఎన్‌(ఐఎం) వర్గాలు చెబుతుండగా ప్రభుత్వం మాత్రం ఘన విజయంగా ప్రకటించుకుంటోంది. ఒప్పందంలోని అంశాలను బహిర్గతం చేయకపోవడం కూడా సందేహాలకు కారణమౌతోంది. ఏమైనప్పటికీ ఇరు పక్షాలూ పరస్పర విశ్వాసంతో, చిత్తశుద్ధితో కృషి చేస్తే శాంతి సాధించడం అసాధ్యమేమీ కాదు....

విద్యా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకే బంద్‌..

ప్రైవేట్‌ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తూ, డిగ్రీలో సెమిస్టర్‌ విధానాన్నీ రద్దు చేయాలని, సంక్షేమ హాస్టళ్ళను మూసివేసే జీవో నెంబర్‌ 45ను రద్దు చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని పటి ష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు సంఘా ల ఆధర్యంలో ఏర్పడిన విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నాం. విలీనం పేరుతో 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు మూసివేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీని ద్వారా ఐదు వేలకు పైగా పాఠశాలలు మూత పడుతున్నాయి.
30 మంది విద్యార్థులున్న పాఠశాలలు మూసివేస్తే 12 వేల పాఠశాలలు మూతబ డతాయి. రాష్ట్రంలోని ప్రైవేట్‌...

దగాకోరు సంస్కరణలు - మోసపూరిత నినాదాలు

దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి రావాలనీ, గ్రామీణ ప్రాం తాలకు కూడా బ్యాంకులు విస్తరిం చాలనీ, దేశ ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు ఎంతో కృషి చేయాలనీ, ఇవి సాధించటం కోసమే 'ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన' ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రకటనలు, మంత్రివర్యుల ఉపన్యాసాలు వింటుంటే విస్మయం కలుగుతుంది. బ్యాంకింగ్‌రంగం ఇంకా ఇంకా ప్రజలకు చేరువ కావాలనే సంకల్పం తోనే బ్యాంకింగ్‌రంగ సంస్కరణలు చేపట్టామని పాలక పక్షాలు ప్రచారం చేయటాన్ని సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకుల జాతీయకరణ జరిగి 46 ఏళ్లు నిండాయి. రిజర్వుబ్యాంకు లెక్కలు, ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే ప్రజలందరి భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత వృద్ధి (ఇంక్లూసీవ్‌ గ్రోత్‌) సాధించలేక...

నిలువెత్తు నిర్లక్ష్యం..

మధ్యప్రదేశ్‌లో వరుసగా జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాలు దిగ్భ్రాంతినీ, రైల్వే శాఖ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ప్రయాణీకులతో కిటకిటలాడుతున్న రెండు రైళ్లు నిమిషాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో పట్టాలు తప్పడం, 37 మంది దాకా మృతి చెందడం దారుణం. మరో 25 మంది దాకా తీవ్ర గాయాల పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. స్థానికులు సకాలంలో స్పందించడంతో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. లేని పక్షంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. వాస్తవానికి రైలు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా ఎప్పుడో మారిపోయాయి. భద్రతకు ఏమాత్రం పూచీ లేని పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఆప్తులను, సన్నిహితులను రైలు ఎక్కించిన తరువాత వారు క్షేమంగా గమ్యం చేరారన్న సమాచారం అందేంత వరకూ ప్రాణాలు...

సమర్థనీయం కాదు..

ఉన్నత పదవుల్లో అవినీతిపై చర్య తీసుకోవాలని పట్టుబట్టినందుకు పాతికమంది కాంగ్రెస్‌ ఎంపీలను పార్లమెంటు నుంచి అయిదు రోజులపాటు గెంటివేసిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్య ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఇందిర ఎమర్జెన్సీకి 40 ఏళ్లు గడిచిన సందర్భంలోనే దేశంలో మోడీ ఏలుబడిలో మళ్లీ అటువంటి నిరంకుశ పోకడలు వ్యక్తమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభకు అంతరాయం కలిగించారని, అందుకే నిబంధనల ప్రకారం వారిపై చర్య తీసుకోవాల్సి వచ్చిందని స్పీకర్‌ తన చర్యను సమర్థించుకున్నారు. స్పీకర్‌ చెప్పిందే వాస్తవమైతే మొదట వేటు ప్రభుత్వంపై పడాలి. ఎందుకంటే సభ సజావుగా సాగకపోవడానికి ప్రభుత్వమే అసలు ముద్దాయి. అదీగాక స్పీకర్‌ ఇప్పుడు ఉటంకిస్తున్న నిబంధనలు కూడా...

అణు ఒప్పందం-ప్రతికూల పర్యవసానాలు

భారత్‌-అమెరికా అణు ఒప్పందాన్ని 2005 జులై 18న ప్రకటించారు. ఇప్పటికి పదేళ్ళు గడిచింది. ప్రారంభం నుంచీ సిపిఎం, ఇతర వామపక్షాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాయి. అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాతో పెట్టుకోవాలనుకున్న విస్తృత శ్రేణి వ్యూహాత్మక పొత్తులో ఇది కీలక భాగంగా వామపక్షాలు భావించాయి. ఈ ఒప్పందంలోని ప్రతి అంశం పట్ల వామపక్షాలు ప్రదర్శించిన వ్యతిరేకత పదేళ్ళ తర్వాత కూడా వాస్తవమేనని రుజువైంది.
బూటకపు వాదనలు
ఈ అణు ఒప్పందం ఇంధన రంగంలో పెద్ద ఎత్తున మార్పు తీసుకొస్తుందని యుపిఎ ప్రభుత్వం నాడు చెప్పింది. దేశానికి అవసరమైన సాంకేతిక, వ్యూహాత్మక ప్రయోజనాలు దీనివల్ల సమకూరతాయని పేర్కొంది. ఈ ఒప్పందం వల్ల...

ఆర్థిక విధానంపై ప్రతిష్టంభన..

ఆర్థిక విధానానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య విభేదాలున్నాయని వార్తా పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. గవర్నర్‌ అధికారాలను కుదించటానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంకు చట్టాన్ని సవరించాలని ప్రభు త్వం ఆలోచిస్తున్నంత తీవ్రంగా ఈ అభిప్రాయభేదాలున్నాయి. అయితే ఈ తేడాలు భారత ఆర్థిక వ్యవస్థలో లోతుగా పాతుకుపో యిన అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలే. ఇక్కడ ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అనేది కాదు. అసలు విషయం ఏమంటే ఏ విధానాన్ని అవలంబించినా ఆర్థిక వ్యవస్థ మరింత ఒడిదుడుకులకు లోనుకావటం తథ్యమనేది. ఒక సంక్షోభ రూపాన్ని అధిగమించే ప్రయత్నం చేసినప్పుడు అది విజయవంతంగా మరో రూపాన్ని సంతరించుకుంటున్న పరిస్థితిని సంక్షోభంగా నిర్వచించినప్పుడు భారత ఆర్థిక...

Pages